TTD: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. డిసెంబర్ 1నుంచి అమల్లోకి ..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి మారిన వేళలు అమల్లోకి రానున్నాయి.

TTD: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. డిసెంబర్ 1నుంచి అమల్లోకి ..

TTD

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5గంటల నుంచి 8గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్చనున్నారు. మారిన వేళలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ తెలిపింది.

TTD 2023 Calendars, Diaries : టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు.. శ్రీవారి భక్తులకు అందుబాటులోకి..

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. సాధారణంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన వెంటనే ఉదయం 5గంటల నుంచి బ్రేక్ దర్శనం వేళలు ఉంటాయి. అలాకాకుండా.. రాతంత్రా క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులకు తొలుత శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఆ తరువాతే వీఐపీలకు అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనభాగ్యం కలగడమే కాకుండా గదుల కేటాయింపుపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

TTD about laddu: తిరుమల శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలొద్దు: టీటీడీ

శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వెంకన్న స్వామిని 76,681 మంది భక్తులు దర్శించుకోగా, ఆదివారం శ్రీవారిని 73,831 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 5.2 కోట్లు. ఇదిలాఉంటే సర్వదర్శనం కోసం 31కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల ఉన్న క్యూలైన్లు ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది.