Cinema Theatres : ఏపీలోనూ సినిమా థియేటర్లు బంద్..?

ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్.. స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలనే నిర్ణయం తీసుకుంది. వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లకు మాత్రం రెండు రోజులు మిన‌హాయింపు ఇచ్చారు. మిగిలిన థియేటర్లు అన్ని బంద్ చేశారు.

Cinema Theatres : ఏపీలోనూ సినిమా థియేటర్లు బంద్..?

Cinema Theatres

AP Cinema Theatres Close : ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్.. స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలనే నిర్ణయం తీసుకుంది. వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లకు మాత్రం రెండు రోజులు మిన‌హాయింపు ఇచ్చారు. మిగిలిన థియేటర్లు అన్ని బంద్ చేశారు.

వైరస్ దారుణంగా పెరుగుతున్న ఈ సమయంలో థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు రారని తెలంగాణ థియేట‌ర్ల‌ యాజమాన్యం నిర్ణయించుకుంది. అందుకే కాస్త కఠినంగా ఉన్నా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం ఏపీ థియేటర్లపై కూడా ప్రభావం చూపించనుంది. క‌చ్చితంగా అక్కడి థియేటర్లు కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పైగా ప్రేక్షకులు థియేటర్లకు కూడా రావడం లేదు. ఉన్న ఒక్క వకీల్ సాబ్ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు తెరిస్తే కనీసం కరెంటు బిల్లు కూడా రాదని అసోసియేషన్‌కు తెలియని విషయం కాదు. అందుకే ఏపీలో కూడా కొన్ని రోజుల పాటు థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఏపీ థియేటర్స్ అసోసియేషన్ తమ నిర్ణయాన్ని తెలపనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.