CPI Ramakrishna: ఇప్పటికే జగన్ బీజేపీ రోడ్డు మ్యాప్ లో నడుస్తున్నారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

సీఎం జగన్ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారని ఇక పవన్ కళ్యాణ్ కు ఎక్కడ అవకాశం లభిస్తుందని అన్నారు

CPI Ramakrishna: ఇప్పటికే జగన్ బీజేపీ రోడ్డు మ్యాప్ లో నడుస్తున్నారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

Ramakrishna

Updated On : March 18, 2022 / 9:58 PM IST

CPI Ramakrishna: రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని అందుకోసం బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చుస్తున్నానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. శుక్రవారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారని ఇక పవన్ కళ్యాణ్ కు ఎక్కడ అవకాశం లభిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో వాస్తవాలు తెలుసుకుంటారని..బీజేపీకి, జనసేనకు మధ్య త్వరలోనే తెగతెంపులు జరుగుతాయని రామకృష్ణ జోస్యం చెప్పారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పవన్ కలిసి వస్తారని రామకృష్ణ అన్నారు.

Also Read: PM Modi Hails Media: ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియా సానుకూల దృక్పధంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

మరోవైపు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా ఘటనపై రామకృష్ణ స్పందిస్తూ అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నాటుసారా తాగి ఒకేసారి 25 మంది చనిపోతే.. సహజ మరణాలంటు సీఎం చెప్పడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు. నాటుసారా మరణాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించి భాదిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అమ్ముతున్న జగన్ ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు రాబట్టారని రామకృష్ణ ఆరోపించారు.

Also Read: Bonda Umamaheshwarrao: రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, నాటుసారా, అక్రమ రవాణా: బోండా ఉమా