Sachivalayam Employees : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు.

Sachivalayam Employees : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

Sachivalayam Employees

Sachivalayam Employees : ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో పాసైన ఉద్యోగులకే ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే వేతనాలు చెల్లించనుంది ప్రభుత్వం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇప్పటివరకు లక్ష మందికిపైగా ప్రొబేషన్ డిక్లరేషన్ కు అర్హులుగా ఉన్నారని.. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం తెలిపింది. వచ్చే ఆగస్టు 31వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికి ప్రొబేషన్ డిక్లరేషన్ వచ్చేలా వరుస పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.

” గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సుమారు ఒక లక్ష 17వేల మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేశాయి. ఈరోజు సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. వాళ్లకు జూలై 1 నుంచి పొబ్రేషన్ డిక్లేర్ అయ్యి.. కొత్త పీఆర్సీ 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పిన ప్రతిపాదనపై సీఎం జగన్ ఇవాళ సంతకం చేశారు. వెంట వెంటనే ఎగ్జామ్స్ పెట్టించి ఆగస్టు 31వ తేదీ నాటికి గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులందరిని ప్రొబేషన్ డిక్లేర్ చేసేలాగా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని” ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు.

CM Jagan Good News : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ ఫైల్‌పై జగన్ సంతకం

గ్రామ, వార్డు సచివాలయ కొలువులకు భద్రత కల్పించడానికి సీఎం జగన్ సమాయత్తమవుతున్నారని.. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను డిక్లేర్ చేయాలని నిర్ణయించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్న సీఎం జగన్.. ఈ క్రమంలో ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై సంతకం చేసినట్లు వెల్లడించారు.

కాగా, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికే ప్రొబేషన్ డిక్లరేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రొబేషన్ ఇచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జులై 1 నుంచి ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని ఆదేశించారు.

ప్రొబేషన్ డిక్లరేషన్ తో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ప్రకారం జీతాలు పెరుగుతాయి. డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ప్రొబేషన్ పూర్తయిన వారికి మాత్రమే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందుతాయని తెలుస్తోంది. ఏపీపీస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని వారి కోసం ఈ నెలలోనే మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష : అభ్యర్థులకు రూల్స్ ఇవే

క్షేత్ర స్థాయిలో సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ సచివాలయాల్లో 1.15 లక్షల మందికిపైగా ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొబేషన్ గడువు పూర్తయ్యాక డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే 2021 నవంబర్‌లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు.