CM Jagan : సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్..?

కొన్ని రోజులుగా ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయనుంది.

CM Jagan : సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్..?

CM Jagan : కొన్ని రోజులుగా ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయనుంది.

కొంతకాలంగా ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆనం. నాలుగేళ్ల పాలనలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు ఆనం. ముందస్తు ఎన్నికలకు వెళితే ఇంటికెళ్లడం ఖాయమన్నారు.

Also Read..Anam Ramanarayana Reddy : నేను ఎమ్మెల్యేనా? కాదా? మరోసారి బరస్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత

ఇలా పలు సందర్భాల్లో సొంత పార్టీ ప్రభుత్వం పైనే ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆనం చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆనం వ్యాఖ్యలు ఇబ్బందికరంగా, పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆనంకు ఝలక్ ఇవ్వనుంది వైసీపీ హైకమాండ్. వెంకటగిరి ఇంచార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.

కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆనం.. మరోసారి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఏడాదిలోపే ఇంటికి వెళ్లడం ఖాయం అని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా సచివాలయ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదన్నారు. దీనికి సాంకేతిక కారణమా? చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయా? ఎందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు? అని ఆనం ప్రశ్నించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఆనం.

Also Read..Pensions Removal : పెన్షన్ల కోత.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

”మీరు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావొస్తోంది. కానీ, ఇంతవరకు సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు. అలాంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఈ విషయాన్ని మన నాయకులు కానీ, ఇంజినీర్లు కానీ మర్చిపోకూడదు. ఒక ఎమ్మెల్యేకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో మరో ఏడాది మాత్రమే మిగిలుంది. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని. ఆ ఎన్నికలు కానీ వస్తే.. ఏడాదిలోపే ఇంటికి వెళ్లిపోతాం” అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆనం చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.