Amma Vodi : ఆ రోజున ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు, 12న స్కూల్స్ రీఓపెన్, 20న టాపర్లకు సత్కారం- మంత్రి బొత్స కీలక ప్రకటన

Amma Vodi : జగనన్న విద్యా కానుక కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారు.

Amma Vodi : ఆ రోజున ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులు, 12న స్కూల్స్ రీఓపెన్, 20న టాపర్లకు సత్కారం- మంత్రి బొత్స కీలక ప్రకటన

Amma Vodi (Photo : Google)

Jagananna Amma Vodi Scheme : జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా‌ పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2500 రూపాయలతో ఒక్కో విద్యార్ధికి జగనన్న విద్యా కానుక కిట్ ఇస్తున్నట్టు చెప్పారు. విద్యాకానుక కిట్ ను 12వ తేదీ నాటికి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

పెదకూరపాడు క్రోసూరు గ్రామంలో సీఎం జగన్ విద్యార్ధులకు విద్యాకానుక కిట్ అందచేస్తారని మంత్రి బొత్స వెల్లడించారు. జగనన్న విద్యా కానుక కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూల్స్ లో టాపర్లను సత్కరిస్తారని తెలిపారు.

Also Read..Hyderabad : బాబోయ్.. పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు.. హైదరాబాద్‌లో కలకలం, అసలేం జరిగిందంటే

” ఈ నెల 28న‌ అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. మొదటి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను 12 నుంచి ప్రారంభించబోతున్నాం. విద్యార్థులు అభివృద్ధి చెందాలని మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి, ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రైమరీ జూనియర్ ను ప్రవేశపెడుతున్నాం. విద్యార్ధులకు బోధించే ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తాం. గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నాం. నూతన విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఏపీలో మార్పులకు శ్రీకారం చుట్టాం. ఫౌండేషన్ నుంచే‌ విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు.

విద్యాశాఖ అధికారి శ్రీనివాస్..
నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు విద్యాకానుక ద్వారా అన్నీ అందిస్తున్నాం. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు యూనిఫామ్ పై అవగాహన కల్పిస్తున్నాం. గత ఏడాదిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పూర్తి నాణ్యతతోనే విద్యా కానుక కిట్లను విద్యార్ధులకు అందిస్తున్నాం.