AP CM YS Jagan: నేడు నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటన .. లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

AP CM YS Jagan: నేడు నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటన .. లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ

ys jagan

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం సుమారు మూడు గంటల పాటు నరసన్నపేటలో ఉండనున్న నేపథ్యంలో పర్యటన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 20వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

AP CM YS Jagan: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళకు ఏపీ సీఎం అండ.. సాయం అందించేందుకు హామీ!

సీఎం పర్యటనలో భాగంగా ఉదయం 10.35 గంటలకు జగన్ జమ్ముకూడలి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాలు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం ప్రధాన రోడ్డుమీదుగా రెండు కిలో మీటర్లమేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శిస్తారు. సభా వేదికకు చేరుకొని సుమారు 45నిమిషాలు జగన్ ప్రసంగిస్తారు. అనంతరం భూ భక్కు పత్రాల పంపిణీ చేస్తారు.

నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటన ఇలా..

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి మధ్యాహ్నం 12.55గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా సభలో లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ మోహన్‌రెడ్డి తిరిగి చేరుకుంటారు.