AP CM YS Jagan: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళకు ఏపీ సీఎం అండ.. సాయం అందించేందుకు హామీ!

తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

AP CM YS Jagan: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళకు ఏపీ సీఎం అండ.. సాయం అందించేందుకు హామీ!

AP CM YS Jagan: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళకు ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.

Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

ఆమెకు వైద్యం చేయించే విషయంలో ఆరుద్ర ఇబ్బంది పడుతోంది. తన కూతురు వైద్యం విషయంలో సాయం చేయాలని కోరుతూ ఆమె కాకినాడ కలెక్టరేట్‌లో పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో తన గోడు నేరుగా సీఎం వైఎస్.జగన్‌కే చెప్పుకొందామని ప్రయత్నించింది. దీనికోసం ఈ నెల 1న తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. అయితే, అక్కడి సిబ్బంది సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో వెంటనే ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంది.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

విషయం తెలుకున్న సీఎం ఆమెను క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. దీంతో అధికారులు ఆమెను అంబులెన్స్‌లో సీఎం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆరుద్ర నుంచి వివరాలు సేకరించిన సీఎం ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీ చంద్రకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.