YS Jagan Mohan Reddy : రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్

Amaravati : అమరావతి సభ నుండి తిరుగు ప్రయాణంలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న 25మంది లబ్ధిదారుల్లో 15మందికి స్వల్పంగా, ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

YS Jagan Mohan Reddy : రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్

YS Jagan Mohan Reddy (Photo : Google)

Amaravati : అమరావతి సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచిచారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు జగన్. స్వల్ప గాయాలైన వారికి రూ.15వేలు, తీవ్ర గాయాలైన దివ్య, మీనాకుమారి, రాజేశ్ లకు రూ. లక్ష చొప్పున ప్రభుత్వం అందించింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. బాధితులకు కలెక్టర్, ఎమ్మెల్యే చెక్కులు అందించారు.

జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు..
అమరావతి సభ నుండి తిరుగు ప్రయాణంలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న 25మంది లబ్ధిదారుల్లో 15మందికి స్వల్పంగా, ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలియగానే సీఎం స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్ర గాయలైన వారికి రూ.లక్ష.. స్వల్ప గాయాలైన వారికి రూ.15 వేలు ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. చెక్కులను బాధితులకు అందించాం.

Also Read..YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు..
స్వల్ప గాయాలైన వారు ఇంటికి వెళ్లిపోయారు. వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందిస్తాం. రెక్కాడితే కానీ డొక్కాడని బాధితులకు వైద్యం పొందుతున్న సమయంలో కూడా ఆర్థికసాయం అందించారు. బాధితులు పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని, మెరుగైన వైద్యం చేయాలని సీఎం ఆదేశించారు.