Jail DIG Ravikumar : చంద్రబాబుకు అస్వస్థత అనేది అవాస్తవం.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కోస్టల్ శాఖ జైలు డీఐజీ

చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతిక్షణం ఆయన ఆరోగ్యం కోసం వైద్యుల పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.

Jail DIG Ravikumar : చంద్రబాబుకు అస్వస్థత అనేది అవాస్తవం.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కోస్టల్ శాఖ జైలు డీఐజీ

Chandrababu Health Rajahmundry Jail

Updated On : October 11, 2023 / 9:14 AM IST

Jail DIG Ravikumar – Chandrababu Health : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం కోసం తప్పుడు కథనాలపై కోస్టల్ శాఖ జైలు డీఐజీ రవికుమార్ స్పందించారు. చంద్రబాబుకు ఎండ తీవ్రత, అస్వస్థత అనేది అవాస్తమని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ రవికుమార్ హెచ్చరించారు.

చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతిక్షణం ఆయన ఆరోగ్యం కోసం వైద్యుల పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆయన కోసం సెంట్రల్ జైలులో పది మంది వైద్యులు ఉన్నారని వెల్లడించారు. ఎమర్జెన్సీ అయితే 108 సిద్ధంగా ఉందని తెలిపారు.

High Court : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ

ఈరోజు ములాఖత్ లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ సీనియర్ నేత కలిశారని, అంతా సవ్యంగానే ఉందని ఆయనే మీడియాతో వెల్లడించారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని కేటాయించారు. ఆయనకు ఇంటి భోజనానికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.