AP Corona : పిల్లలను స్కూళ్లకు పంపాలా వద్దా ? బడుల్లో కరోనా పంజా

పది రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ...పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

AP Corona : పిల్లలను స్కూళ్లకు పంపాలా వద్దా ? బడుల్లో కరోనా పంజా

Ap School

Corona Cases In AP : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. కేసులు ఇంకా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..పది రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ…పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే పిల్లలు బడిబాట పడుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలోనూ భారీగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ స్కూలులో చదువుతున్న 10 మంది 4వ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కోరారు ఎంఈవో. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

Read More : India Vs England : టీమిండియా చెత్త ప్రదర్శన, ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యం

బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుండటంతో.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకే రోజు ఐదు పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆ స్కూలును మూసివేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వహించవద్దని.. లేదంటే వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుందని హెచ్చరించింది. పాజిటివ్ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్ చేసి ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించింది సర్కార్‌.

Read More : JEE: జేఈఈ 4వ సెషన్ పరీక్షలు

అలాగే హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచించింది. ప్రతి స్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. చిన్నారుల్లో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టులకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తామని తెలిపింది ఏపీ ఆరోగ్య శాఖ.