ఏపీలో కరోనా ఉగ్రరూపం.. లక్ష దాటిన పాజిటివ్ కేసులు

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 06:33 PM IST
ఏపీలో కరోనా ఉగ్రరూపం.. లక్ష దాటిన పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 2 వేల 349 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 6 వేల 51 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1210 కేసులు ఉన్నాయి.

తూర్పు గోదావరిలో ఇప్పటివరకు 14,696 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 664 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురంలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. 24 గంటల్లో 49 మంది బలి అయ్యారు.

జూన్ 24వ తేదీ వరకు 10 వేలు, జులై6 వరకు 20 వేలు, జులై 13 వ తేదీ 30 వేలు, జులై 17వ తేదీ వరకు 40 వేలు, జులై 20 వ తేదీ నాటికి 50 వేలు, జులై 22 నాటికి 60 వేలు, జులై 23 నాటికి 70 వేలు, జులై 24 నాటికి 80 వేలు, జులై 26 నాటికి 90 వేలు, జులై 27 నాటికి లక్షా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు 744, విశాఖ 655, అనంతపురం 524, నెల్లూరు 422, ప.గో 408, చిత్తూరు 367, కడప 336, ప్రకాశం 317, విజయనగరం 157, కృష్ణా 127, శ్రీకాకుళం 120 కేసుల చొప్పన నమోదు అయ్యాయి. ప.గో 9, విశాఖ 8, చిత్తూరు, తూ.గో ఏడుగురు చొప్పున మృతి చెందారు.

కృష్ణా, విజయనగరంలో నలుగురు, అనంతంపురంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు. కడప, ప్రకాశంలో ఒకరు చొప్పున మృతి చెందారు. నాలుగు జిల్లాల్లో 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గత 24 గంటల్లో 43,127 శాంపిల్స్ పరీక్షించగా 6,051 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 3,234 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.నేటి వరకు రాష్ట్రంలో 16,86,446 శాంపిల్స్ పరీక్షించారు.