ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…తూ.గో జిల్లాలో తగ్గాయి….కర్నూల్ లో పెరిగాయి

  • Published By: bheemraj ,Published On : August 1, 2020 / 07:50 PM IST
ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…తూ.గో జిల్లాలో తగ్గాయి….కర్నూల్ లో పెరిగాయి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని మరో 12,750 మంది డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,50,209కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1,407 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,12,573 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 76,614 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 60,797 శాంపిల్స్ ను పరీక్షించగా వీటిలో 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,234 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విశాఖ 1155, అనంతపురం 1128, గుంటూరు 1001, చిత్తూరు 949, ఈస్ట్ గోదావరి 876, నెల్లూరు 559, కడప 547, వెస్ట్ గోదావరి 494, శ్రీకాకుళం 455, ప్రకాశం 402, కృష్ణా 357, విజయనగరం 119 కరోనా కేసులు నమోదయ్యాయ.



గత 24 గంటల్లో కరోనా వల్ల తూర్పు గోదావరి 8, విశాఖ 8, గుంటూరు 7, అనంతపురం 6, చిత్తూరు 6, కర్నూలు 6, శ్రీకాకుళం 4, కృష్ణ 3, పశ్చిమగోదావరి 3, నెల్లూరు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కడపలో ఒకరు చొప్పున మృతి చెందారు.