విశాఖలో కరోనా పాజిటివ్ : అల్లిపురంలో రహదారుల మూసివేత

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 04:00 AM IST
విశాఖలో కరోనా పాజిటివ్ : అల్లిపురంలో రహదారుల మూసివేత

విశాఖలో కోవిడ్‌ – 19 (కరోనా) బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప్రాంతం మొత్తాన్ని వైద్యారోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే అల్లిపురం వివేకానంద కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్‌ పనులు చేపట్టారు. వార్డు వలంటీరు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ ఒక టీమ్‌గా మొత్తం 141 బృందాల్ని ఏర్పాటు చేశారు. బాధితుడి సన్నిహితులు 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

See Also | హైదరాబాద్ ఎల్బీనగర్ లో కరోనా కలకలం

వృద్దుడు ఎవరెవరిని కలిశాడు ? ఎక్కడ తిరిగాడు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అతని భార్యకు కరోనా లక్షణాలు ఉండడంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు వార్డుల పరిధిలో సుమారు ఐదు వేల నివాసాలున్నాయి. ప్రతింటికి తిరిగి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు వైద్యాధికారులు. ఎవరికి అలాంటి లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. 

* కరోనా కల్లోలం.
* బోసిపోయిన తిరుపతి.
* భక్తుల రాకను నిలిపివేసిన టీటీడీ.

* శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి.
* భారత్‌లో 258కు చేరిన కరోనా కేసులు.
* భారత్‌లో కొత్తగా 55 మందికి కరోనా పాజిటివ్‌.

* మహారాష్ట్రలో అత్యధికంగా 52 మంది బాధితులు.
* వైరస్‌ బాధితుల్ని కలిసిన 6700 మందిపై కేంద్రం నిఘా.
* రేపటి జనతా కర్ఫ్యూ కోసం వివిధ రాష్ట్రాల్లో చర్యలు.

* శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 దాకా రైళ్లు బంద్‌.
* ఆదివారం ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో మెట్రో రైలు నిలిపివేత.
Read More : కరోనా దెబ్బ : పెళ్లికి రండి..మాస్క్‌లు పంపిణీ చేసిన వరుడు