నెల్లూరులో కరోనా అనుమానిత కేసు

నెల్లూరులో కరోనా అనుమానిత కేసు నమోదైంది. లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ స్టూడెంట్ కు జీజీహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 07:48 AM IST
నెల్లూరులో కరోనా అనుమానిత కేసు

నెల్లూరులో కరోనా అనుమానిత కేసు నమోదైంది. లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ స్టూడెంట్ కు జీజీహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

నెల్లూరులో కరోనా అనుమానిత కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ స్టూడెంట్ కు కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో నెల్లూరులోని జీజీహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిన్న బజారుకు చెందిన అతను రెండు రోజుల నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో పాటు ఇటలీలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. (ఇరాన్ లో కారోనా విజృంభణ : నేడు స్వదేశానికి 58 మంది భారతీయులు)

ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి 466 ప్రయాణికులు ఏపీకి వచ్చారు. 234 ప్రయాణికులు ఇళ్ల వద్ద వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తి అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది. 

36 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా వీరిలో 34 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలిన ఇద్దరి శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు. 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. 

భారత్‌లో కరోనా కేసులు 47కు చేరాయి. 40 కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణాలు ఏం కనిపించినా కింది సెంటర్లలో సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.
 

See Also | తండ్రి జయంతి రోజునే కాంగ్రెస్‌కు కొడుకు జ్యోతిరాదిత్య గుడ్ బై, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పతనం?