Purandeswari : ఎన్టీఆర్ కూతుళ్లుగా నేనూ, నా సోదరి విలువలతో పెరిగాం.. వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను పురంధేశ్వరి..

Purandeswari : ఎన్టీఆర్ కూతుళ్లుగా నేనూ, నా సోదరి విలువలతో పెరిగాం.. వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి

Daggubati Purandeswari

Purandeswari : ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. త‌న సోద‌రి భువ‌నేశ్వ‌రికి ట్విట్ట‌ర్ వేదిక‌గా సంఘీభావం ప్ర‌క‌టించారు. వ్య‌క్తిత్వ హ‌న‌నం (క్యారెక్టర్ అసాసినేషన్) స‌హేతుకం కాద‌ని ఆమె అన్నారు. భువనేశ్వరి పై వైసీపీ నేతల వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఈ ఘటనతో తన మనసు గాయపడిందన్నారు. ఎన్టీఆర్ కూతుళ్లుగా నేను నా సోదరి నైతిక విలువ‌ల‌తో పెరిగామ‌న్నారు. విలువ‌ల‌ విషయంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

కాగా, ఈ వ్యవహారంలో భువ‌నేశ్వ‌రికి నంద‌మూరి కుటుంబం సంఘీభావం తెలిపింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి హ‌రికృష్ణ కూతురు సుహాసిని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు.

మరోవైపు బీజేపీ నేత సుజనాచౌదరి కూడా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీలో రాజకీయాలు ఇంత అథమస్థాయికి పడిపోవడం బాధాకరమన్నారు. ఇన్నాళ్లు వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, ఈరోజు చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించడం ద్వారా వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇది సిగ్గు చేటు అన్న ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనసభలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం సందర్భంలో.. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ వెక్కి వెక్కి ఏడ్చారు.