Daggubati Purandheswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరణ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్.. పొత్తుల విషయంపై క్లారిటీ..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Daggubati Purandheswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరణ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్.. పొత్తుల విషయంపై క్లారిటీ..

Daggubati Purandheswari

Daggubati Purandheswari: బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తనపై నమ్మకంతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నన్ను నియమించినందుకు మోదీ, అమిత్ షా, నడ్డాల‌కు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా పార్టీకోసం కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ బలోపేతంకోసం కృషిచేస్తానని చెప్పారు. అభివృద్ధి‌కి పెద్దపీట వేస్తూ అవినీతికి దూరంగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

Daggubati Purandheswari : అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి

జనసేన మాకు ఎప్పటికీ మిత్రపక్షమే ..

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని పురంధరేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువగా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. పొత్తుల విషయంపై పురంధరేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని కేంద్ర పార్టీ పెద్దలు చూసుకుంటారని స్పష్టం చేశారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. జనసేనతో పొత్తు విషయంపై ప్రస్తావిస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సోమూవీర్రాజు మాట్లాడుతునే ఉండేవారని అన్నారు. జనసేన‌ పార్టీతో సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు. జనసేన మాకు ఎప్పటికీ మిత్ర‌పక్షమే అని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

BJP Party: బండి సంజయ్, సోము వీర్రాజులకు కీలక పదవులు.. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లేదెవరు?

వైపీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ..

– ఏపీకి ప్రధాని ఆవాస్ యోజన కింద 22లక్షలకుపైగా ఇళ్లను కేటాయించామని, గడిచిన తొమ్మిదేళ్లలో 20వేల కోట్లను ఏపీకి కేటాయించడం జరిగిందని చెప్పారు. 35శాతం ఇళ్లనుకూడా నిర్మించి ఇవ్వలేదని పురంధరేశ్వరి విమర్శించారు. ఇళ్లను ఎందుకు నిర్మించలేదో పేదలకు ఇచ్చే సమాధానం ఏంటో తెలపాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

– ఏపీలో జాతీయ రహదారుల 8623 కిలో మీటర్లకు 1 లక్షా 15 వేల కోట్లు నిర్మాణాలకు కేంద్రం కేటాయించిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలని పురంధరేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసని ఆమె అన్నారు.

– ఏపీ డివిజన్ యాక్ట్ ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించింది. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో జరిగిన అభివృద్ధి కనిపిస్తుంది. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని పురంధరేశ్వరి అన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని ఆమె ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

– రాష్ట్రంలోని నిమ్స్‌ను పట్టించుకోవడం లేదు. ఎన్ఆర్‌జీపీ కింద 2022-23 వరకు ఎనిమిది వేల కోట్లకు పైగా వచ్చాయి.

– రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత‌ బియ్యం అందుతోంది. ఈ ఏడాది బియ్యం ద్వారా 10వేల కోట్లకుపైగా రాష్ట్రానికి అందింది.

– సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతి రైతుకు 12వేలు ఇస్తామన్నారు. ఆ మేరకు ఇస్తున్నారా? సిఎం జగన్ సమాధానం చెప్పాలని పురంధరేశ్వరి అన్నారు. కేంద్రం ఇస్తున్న ఆరు వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇది రైతులను సీఎం మోసం చేయడం కాదా? అని అన్నారు.

– రైల్వేలో 72 స్టేషన్ల అభివృద్ధికి కేంద్రమే సహాయ సహకారాలు అందించింది. ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అన్ని డవలప్ అవుతాయి. లేకుంటే పెండింగ్‌లో ఉన్నవి పెండింగ్‌లోనే ఉంటాయి అని అన్నారు.

– కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుంది. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

– పోలవరం పై కేంద్రం ఎక్కడా‌జాప్యం చేయలేదు. ఇటీవల 12 వేల కోట్లు పోలవరంకి కేంద్రం ఇచ్చింది. పోలవరం మీరు కట్టకుంటే కేంద్రానికి అప్పచెప్పండి. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పురంధరేశ్వరి అన్నారు.

– రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని పురంధరేశ్వరి ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. దిశా ఎందుకు పనికిరావడం లేదన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు రక్షణ కల్పిస్తుందో అందరికి అర్థమవుతుందని పురంధరేశ్వరి ఎద్దేవా చేశారు.

– నాసిరకం మద్యం‌ను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను ప్రభుత్వం హరిస్తుందని ఆరోపించారు. నాణ్యతలేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం లేదా? అని పురంధరేశ్వరి ప్రశ్నించారు. మద్యం బ్రాండ్ల ద్వారా 20శాతం ఓనర్‌కు వెళితే 80శాతం ప్రభుత్వానికి వస్తుంది. అందులో 25శాతం బిల్లులే లేవని పురంధరేశ్వరి  ఆరోపించారు.