BJP Party: బండి సంజయ్, సోము వీర్రాజులకు కీలక పదవులు.. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లేదెవరు?

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖల బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండిసంజయ్‌లు నియమితులయ్యారు.

BJP Party: బండి సంజయ్, సోము వీర్రాజులకు కీలక పదవులు.. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లేదెవరు?

Sanjay and Somu Veerraju

BJP National executive committee: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ(BJP) కేంద్ర పార్టీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లోని పార్టీలో కీలక మార్పులు చేస్తుంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలపైన దృష్టిపెట్టిన బీజేపీ అధిష్టానం.. అధ్యక్షులను మార్పు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్‌ (Bandi sanjay) ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కి , ఏపీలో సోమువీర్రాజు (Somu Veerraju) ను తప్పించి బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన విషయం విధితమే. తాజాగా బండి సంజయ్, సోము వీర్రాజుకు కీలక పదవులు కట్టబెట్టింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వీరు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పది మంది సభ్యులకూ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది.

PM Modi Warangal tour: తెలంగాణను అవినీతిమయం చేశారు.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. ప్రధాని మోదీ.. Live Updates

టార్గెట్ తెలంగాణ .. 

తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గద్దెదించి అధికారం పీఠం ఎక్కాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ఆ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగాఉన్న బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. అంతేకా, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారికి కీలక పదవులను అప్పగించింది. మరోవైపు రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జిగా ప్రకాశ్ జవదేకర్, సహాయ ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను హైకమాండ్ నియమించింది. అంతేకాక, ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డాసహా పలువురు కేంద్ర పార్టీ పెద్దలు తెలంగాణలో వరుస పర్యటనలకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా.. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.

PM Modi: కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి .. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం

కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లేదెవరు? 

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం నేతలు భావిస్తూ వచ్చారు. అయితే, తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా బండి సంజయ్‌ను నియమించడం ద్వారా త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బండి సంజయ్ కు అవకాశం లభిస్తుందా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి స్థానాన్ని బండి సంజయ్‌తో భర్తీచేయకపోతే మరెవరికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.