PM Modi: కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి .. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం

తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి పాకింది. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి .. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం

PM Narendra Modi

PM Modi Warangal Tour: తెలంగాణ ప్రభుత్వం ((Telangana Government)) పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కేసీఆర్ (KCR) అవినీతి ఢిల్లీ వరకు చేరిందని అన్నారు. శనివారం ప్రధాని మోదీ వరంగల్ జిల్లా (Warangal District) లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ  వేదికగా రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ..  భద్రాకాళీ మహాత్వం, సమక్క – సారలమ్మ పౌరుషానికి వరంగల్ ప్రతీక, రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అని, ఇలాంటి నగరానికి రావడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా మీ మధ్యకు వచ్చానని చెప్పారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిందని, ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని అన్నారు.

PM Modi Warangal tour: తెలంగాణను అవినీతిమయం చేశారు.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. ప్రధాని మోదీ.. Live Updates

తొమ్మిదేళ్ల పాలన అవినీతి మయం..

తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అవినీతి మయం చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. అవినీతి లేని ఒక్క ప్రాజెక్టు కూడా లేదని, కేసీఆర్ సర్కార్ ఊహించలేనంత అవినీతికి పాల్పడిందని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని పగటి కలలుగానే మిగిపోయాయి. తొమ్మిదేళ్లు అవుతుంది.. ఏమైంది మీ హామీ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్కాం గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తోంది? కేసీఆర్ సర్కార్ ఆ ఉద్యోగాలను తెలంగాణ నేతల జేబులు నింపుకోవడానికి వాడుకున్నారు. ఇది విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న ద్రోహం కాదా అని మోదీ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. అభివృద్ధికోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తుంటాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ, తొలిసారిగా రెండు రాష్ట్రాలు (ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు) అవినీతి కోసం కలిసి పనిచేయడం దౌర్భాగ్యం అని మోదీ విమర్శించారు.

Varahi Vijaya Yatra: పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే..

దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి.. 

కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని మోదీ చెప్పారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోంది. గత తొమ్మిదేళ్లలో కేంద్రం రూ. లక్ష కోట్లకుపైగా నిధులిచ్చిందని మోదీ చెప్పారు. మద్దతు ధర ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని, తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ఇచ్చాం అని అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించటం లేదని మోదీ అన్నారు. మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరు లైన్ల రహదారులు వేస్తున్నాం. కేంద్రం ఇన్ని చేస్తుంటే మరి రాష్ట్రం ఏం చేస్తుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్ లందరూ ఆగ్రహంతో ఉన్నారని మోదీ అన్నారు.

బీజేపీతోనే బంగారు తెలంగాణ.. 

బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకుంది. ఢిల్లీ వరకు తెలంగాణ ప్రభుత్వం అవినీతి పాకింది. దేశంలో గతంలో కాంగ్రెస్ అవినీతి పాలన చూశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడకపోతే తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేది బీజేపీ మాత్రమే. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని ప్రధాని మోదీ అన్నారు.