Earthquake : విశాఖకు భూకంప భయం, నిద్రలేని రాత్రులు గడుపుతున్న జనాలు!

ప్రశాంతంగా ఉండే సాగర నగరం విశాఖకు .. ఇప్పుడు భూకంపం భయం పట్టుకుంది. ఎప్పుడు భూమి కంపిస్తుందోనంటూ.. జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్ద శబ్ధంతో...

Earthquake : విశాఖకు భూకంప భయం, నిద్రలేని రాత్రులు గడుపుతున్న జనాలు!

Vishaka

Earthquake Visakhapatnam : ప్రశాంతంగా ఉండే సాగర నగరం విశాఖకు .. ఇప్పుడు భూకంపం భయం పట్టుకుంది. ఎప్పుడు భూమి కంపిస్తుందోనంటూ.. జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్ద శబ్ధంతో .. 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో .. ప్రజలు వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక బయటకు పరుగులుపెట్టారు. భూకంపం అంటే ప్రకంపనలు సహజమే.. అయితే అసలు ఇంత పెద్ద శబ్దం ఎందుకు వచ్చిందనేది ఎవరికీ అర్ధం కావడంలేదు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో .. అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ..మళ్లీ ఏ అర్ధరాత్రో భూమి కంపిస్తే .. పరిస్థితి ఏంటంటూ .. భయాందోళన చెందుతున్నారు.

Read More : Tirumala-Tirupati : తిరుమల కొండపై వెళ్లేదారి క్లోజ్..భక్తుల ఇక్కట్లు, ఏపీకి భారీ వర్ష సూచన

సాదరణంగా భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు ఉంటాయని, అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుందని, భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాల్లోని కొన్ని భాగాల్లో.. సమస్యలు ఏర్పడటంతో .. ఒకదానికొకటి నెట్టుకుంటాయని వెల్లడిస్తున్నారు. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి.. భూకంపాలు ఏర్పడతాయని వివరిస్తున్నారు. శిలాఫలకాల్లో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి .. భూకంపాలు సంభవిస్తాయి. విశాఖలోని మధురవాడ, అక్కయ్యపాలెం, తాడిచెట్లు పాలెం, మద్దిలపాలెం, సిరిపురం, గవర్నరు బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్, నీలమ్మ వేపచెట్టు, జ్ఞానాపురం, ఎన్‌ఏడీ, ఎయిర్‌పోర్టు, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి వరకు.. భూమి పొరల్లో చోర్నకైట్‌ శిలలు వ్యాపించాయని, సముద్రంలోని కొంత భాగం వరకు కూడా ఈ శిలలున్నాయన్నారు. ఈ చోర్నకైట్‌ శిలలకు, దాన్ని ఆనుకుని ఉన్న ఖోండలైట్‌ శిలలకు మధ్య జరిగిన సర్దుబాటుతోనే ఈ ప్రకంపనలు వచ్చాయంటున్నారు.

Read More : Rajampet: రాజంపేటలో వైసీపీదే గెలుపు.. నాలుగు వార్డుల్లోనే టీడీపీ!

భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీలో ఇప్పటివరకు 26 సార్లు భూ ప్రకంపనలు వచ్చినా.. 1967 మార్చి 27న ఒంగోలులో నమోదైన 5.4 తీవ్రతే.. అత్యధికమని చెబుతున్నారు. అది కూడా రిక్టర్‌ స్కేలుపై 6 దాటలేదంటున్నారు. ఇక 14వ తేదీన వచ్చిన భూకంప తీవ్రత 1.8 మాత్రమేనని.. ఇది రెండు వందల ఏళ్లలో అత్యల్పమని చెబుతున్నారు. అందుకే విశాఖ వాసులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వాతావరణ నిపుణులు. అయితే ప్రజలు అలర్ట్‌గా ఉండటం మంచిదని చెబుతున్నారు.