AP Earthquakes : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు..ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు..!!

ఏపీలోని చిత్తూర్ జిల్లాలో భూకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

AP Earthquakes : చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు..ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు..!!

Ap Earthquakes

AP Earthquakes : ఏపీలోని చిత్తూర్ జిల్లాలో భూకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సోమల మండలంలో భూప్రకంపనలు సంభవించగా ప్రజలంతా మొదటి అయోమయానికి గురయ్యారు. అనంతరం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిత్రూరు జిల్లాలోని ఏటివన్‌, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధిలో మంగళవారం (నవంబర్ 23,2021) రాత్రి సుమారు 8 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.

Read more : Hyderabad : హైదరాబాద్‌‌లో స్వల్ప భూకంపం

నిలబడిన వ్యక్తులు తూలి కిందకు పడిపోవటం..శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్లలో పాత్రలు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ప్రజల్లో ఇంకా ఆందోళన తగ్గలేదు. గతంలోనూ స్థానిక గ్రామాల్లోనిపలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. భూకంపనలు స్వల్పంగా రావటంతో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరుగకపోవటంతో అధికారులు హాయిగా ఊరిపి తీసుకున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఇంకా భయాందోలనలు తగ్గలేదు.