Jagananna Vidya Deevena: పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు.. విద్యార్థుల ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.

AP CM YS Jagan
Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలో జరిగిన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని 2022 ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజను రీయింబర్స్ మెంట్ నిధులు రూ. 694 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
CM YS Jagan : 175 స్థానాలే వైసీపీ టార్గెట్, వారికి జగన్ కీలక బాధ్యతలు
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు అని, విద్యార్థుల ఫీజు ఎంతైనా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100శాతం ఫీజు రీ్యింబర్స్ మెంట్, మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. రూ. 694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఏప్రిల్ – జూన్ 2022 కాలానికి గాను 11.02లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని జగన్ తెలిపారు.
వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చామని, పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చామని, రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష అని జగన్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్ లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని జగన్ భరోసా ఇచ్చారు. విద్యా రంగంపై మూడేళ్లలో రూ. 53వేల కోట్లు ఖర్చుచేసినట్లు సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేవలం నలుగురే బాగుపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో వారికి కడుపుమంట అని టీడీపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత పాలనకు ఈ పాలనలో తేడాను గమనించండి అని జగన్ ప్రజల్ని కోరారు.