Anil Hot Comments : ఎవరైనా జగన్ బొమ్మతో గెలవాల్సిందే.. మళ్లీ నేనే మంత్రిని – అనిల్ హాట్ కామెంట్స్

వైసీపీలో వర్గాలు ఉండవు. అంతా జగన్ వర్గమే. నాతో పాటు ఏ నాయకుడైనా జగన్ బొమ్మతోనే గెలవాలి.(Anil Hot Comments)

Anil Hot Comments : ఎవరైనా జగన్ బొమ్మతో గెలవాల్సిందే.. మళ్లీ నేనే మంత్రిని – అనిల్ హాట్ కామెంట్స్

Anil Hot Comments

Anil Hot Comments : మంత్రి పదవి పోయిందని తనకు బాధ లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అంతేకాదు పదవి పోయిందని డీలా పడిపోను అని తేల్చి చెప్పారు. మళ్లీ మంత్రి పదవి సాధిస్తా అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. 60 సంవత్సరాల వరకు మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. ఇంకో పద్దెనిమిదేళ్లు నాకు అవకాశం ఉంది. ఇంకా ఉన్న 730 రోజులు నిరంతరం కష్టపడతా. మళ్లీ మంత్రి పదవి సాధిస్తా. కష్టపడి పని చేసిన వారికి మళ్లీ మంత్రి పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా కల్పించారు’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం నెల్లూరులో జరిగిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు.

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వార్తలపై అనిల్ ఘాటుగా స్పందించారు. వైసీపీలో వర్గాలు ఉండవన్న అనిల్.. ఉన్న వారంతా జగన్ వర్గమే అని తేల్చి చెప్పారు. నాతో పాటు ఏ నాయకుడైనా జగన్ బొమ్మతోనే గెలవాలని అనిల్ అన్నారు. అంతేకాదు, తాను ఎలాంటి బల ప్రదర్శన కోసం సమావేశం నిర్వహించడం లేదని తేల్చి చెప్పారు. నేను తలపెట్టిన చిన్న చిన్న పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అని అన్నారు. ఎవరికీ బలనిరూపణ చేయాల్సిన అవసరం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. 2024లో మళ్లీ గెలుస్తామని.. మంత్రులుగా వస్తామని జోస్యం చెప్పారు అనిల్ కుమార్ యాదవ్.(Anil Hot Comments)

Kakani Govardhan Reddy : నెల్లూరులో హాట్ హాట్‌‌గా పొలిటిక్స్.. హై కమాండ్ సీరియస్ ?

ఏదో మాట్లాడతానని వచ్చిన మీడియా వాళ్లు పొరపాటు పడకండి అని అన్నారు. ఇంతకాలం మంత్రి పదవి ఉంది కాబట్టే ఆచితూచి మాట్లాడానని, దూకుడు తగ్గించానని ఆయన అన్నారు. ఇప్పుడు మంత్రి పదవిలో లేనని, ఇక నుంచి నా దూకుడుతో రెండు రెట్లు జెట్ స్పీడుతో పోతానని అన్నారు. గత మూడేళ్లుగా వైఎస్ఆర్ కార్యకర్తలను కలుసుకోలేకపోయానని, ఇక నెల్లూరులోనే ఉంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

”జగన్ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. జగన్ వెంట ఓ సైనికుడిలా నడుస్తా. జగన్ వెంట కసితో ప్రయాణం చేశా. జగన్‌ను అభిమానించే ప్రతి గుండె నన్ను రెండుసార్లు గెలిపించింది. మంత్రి పదవి ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని జగన్ ముందే చెప్పారు” అని అనిల్ కుమార్ గుర్తు చేశారు.

”ఇప్పుడు మళ్లీ నిత్యం ప్రజల్లో వుండే అవకాశాన్ని జగన్ కల్పించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి 2024లో మళ్లీ జగన్‌ను గెలిపిస్తాం. మంత్రిగా ఉండటం కంటే జగన్ సైనికుడిగా ఉండటమే ఇష్టం. ప్రతి ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం అందించారు. నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. మొదటి దఫాలోనే మంత్రిని అవుతానని అనుకోలేదు” అని అనిల్ అన్నారు. వాళ్లిద్దరూ కట్టకట్టుకుని వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా.. జగనే సీఎం.. అంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సెటైర్లు వేశారు.

Andra Pradesh : మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్?

సామాన్యుడినైన తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేసిన ముఖ్యమంత్రి జగన్ దేవుడు లాంటివాడని అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్ అయ్యారు. ఈ రెండేళ్లు పార్టీ పటిష్టం కోసం పని చేసి.. జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారాయన. అంతేకాదు వచ్చే జగన్ ప్రభుత్వంలో తాను మళ్లీ మంత్రి పదవి చేపడతానని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు అనిల్.

నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో వర్గపోరు నడుస్తోందని.. కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయనే వార్తలు జోరుగా వినిపించాయి. మంత్రి అయిన తర్వాత కాకాణి తొలిసారి నెల్లూరు వస్తుండగా, అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో సభ ఏర్పాటు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. వైసీపీలో వర్గాలు, విభేదాలు లేవు అంతా జగన్ వర్గమే అంటూ.. అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైకమాండ్ ఆదేశాలో మరో కారణమో కానీ.. నెల్లూరు వైసీపీలో వర్గపోరు వార్తలకు తన కామెంట్స్ తో చెక్ పెట్టారు అనిల్ కుమార్ యాదవ్.