Kakani Govardhan Reddy : నెల్లూరులో హాట్ హాట్‌‌గా పొలిటిక్స్.. హై కమాండ్ సీరియస్ ?

నెల్లూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గ్రూప్‌ గొడవలు ఉత్కంఠ రేపుతున్నాయి...మంత్రి కాకాణి వర్సెస్‌ మాజీ మంత్రి అనిల్‌గా సాగుతున్న పరిణామాలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

Kakani Govardhan Reddy : నెల్లూరులో హాట్ హాట్‌‌గా పొలిటిక్స్.. హై కమాండ్ సీరియస్ ?

Kakani

Updated On : April 17, 2022 / 5:36 PM IST

Politics hot in Nellore : నెల్లూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గ్రూప్‌ గొడవలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరుకు చేరుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకాణి వందల కార్లు, బైక్‌లతో కావలి నుంచి నెల్లూరు బయల్దేరారు. కాకాణి ర్యాలీకి ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అయితే కాకాణి నెల్లూరులో అడుగుపెట్టే సమయానికే మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ దగ్గర వైసీపీ కార్యకర్తలతో అనిల్‌ సభ జరగబోతోంది. మరోవైపు మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా నెల్లూరులో కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు.

Read More : Anil Kumar Yadav: సీఎం జగన్‌కు సైనికుడుగా పని చేస్తా

ఈ క్రమంలో నెల్లూరులో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. మరోవైపు కాకాణి, అనిల్‌ పోటాపోటీ సభలు పెట్టడం వైసీపీ హైకమాండ్‌ రియాక్ట్‌ అయింది. ఇద్దరి విభేదాలపై అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగకుండా సభ నిర్వహించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో నెల్లూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. మంత్రి కాకాణి వర్సెస్‌ మాజీ మంత్రి అనిల్‌గా సాగుతున్న పరిణామాలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

Read More : Anil Kumar Yadav: నెల్లూరు పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న అనిల్ కామెంట్స్

నేతల మధ్య ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నవిబేధాలు బహిరంగమయ్యాయి. నెల్లూరు జిల్లా నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో జగన్ స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఆయనతో పడని వర్గాలు అసంతృప్తితో కొట్టుకలాడిపోతున్నారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి ఓదార్చారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయంలో ఇటీవలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. వీరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ మొదలైంది.