Palnadu Facebook Cheating : పల్నాడు జిల్లాలో ఫేస్‌బుక్ ద్వారా ఘరానా మోసం.. ఫేక్ ఫోటోతో యువకుడి ట్రాప్, ఆందోళనలో తల్లిదండ్రులు

ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు, ఆమె కోసం ఇల్లు వదిలి వెళ్లాడు. ఆమె కోసం తల్లిదండ్రులను, అయిన వాళ్లను సైతం వదులుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకెళితే సిగ్నల్స్ ఆధారంగా కనిపెడతారని మొబైల్ కూడా ఇంట్లోనే వదిలి పెట్టి వెళ్లాడు.

Palnadu Facebook Cheating : పల్నాడు జిల్లాలో ఫేస్‌బుక్ ద్వారా ఘరానా మోసం.. ఫేక్ ఫోటోతో యువకుడి ట్రాప్, ఆందోళనలో తల్లిదండ్రులు

Palnadu Facebook Cheating : ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు, ఆమె కోసం ఇల్లు వదిలి వెళ్లాడు. ఆమె కోసం తల్లిదండ్రులను, అయిన వాళ్లను సైతం వదులుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకెళితే సిగ్నల్స్ ఆధారంగా కనిపెడతారని మొబైల్ కూడా ఇంట్లోనే వదిలి పెట్టి వెళ్లాడు.

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శివనాగరాజు ఇల్లు వదిలి వెళ్లి పది రోజులు అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అబ్బాయి ఆచూకీ కోసం ఆరాతీసిన పోలీసులు.. విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. ముందుగా అమ్మాయి వివరాలు సేకరించారు. పోలీసులు చెప్పిన మాట విని అబ్బాయి బంధువులు షాక్ తిన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫేస్ బుక్ లో శివనాగరాజు ప్రేమలో పడ్డ అమ్మాయి ప్రొఫైల్ ఫేక్ అని తేల్చారు. శివనాగరాజుని ఎవరో ట్రాప్ చేశారని గుర్తించారు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయికి ఈ ప్రొఫైల్ కి అస్సలు సంబంధమే లేదని చెప్పారు. డబ్బు కోసం శివనాగరాజును ట్రాప్ చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల్లో మరింత టెన్షన్ పెరిగింది. తమ కుమారుడిని ట్రాప్ చేసిన వాళ్లు అతడిని ఏం చేశారోనని కంగారుపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఫేక్ ప్రొఫైల్ తో మోసాలు పెరిగాయి. అందమైన అమ్మాయి ఫొటో పెట్టి అమాయక యువకులను దగా చేస్తున్నారు.