Temperatures : తెలుగు రాష్ట్రాల్లో చలి పులి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

రాత్రి పూట కనిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల 15 డిగ్రీల కన్నా తక్కువే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో చలి పులి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Cold

Falling temperatures : తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. రోజురోజుకు టెంపరేచర్ దారుణంగా పడిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు తెలంగాణ వైపు గట్టిగా వీస్తున్నాయి. దీంతో రాబోయే 3 రోజుల్లో.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. కొన్ని ప్రదేశాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా.. 2 నుంచి 4 డిగ్రీలు ఇంకా పడిపోయే అవకాశముందని.. వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే.. రాత్రి పూట కనిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల 15 డిగ్రీల కన్నా తక్కువే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో.. కనీస ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువే నమోదవుతున్నాయి.

AP Government : నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు.. పీఆర్సీపై క్లారిటీ వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో.. సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతోంది. ఒక్కసారిగా చలి పెరగడంతో.. జనం ఇబ్బందికి గురవుతున్నారు. వారం కిందటి వరకు.. సాధారణంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వెదర్‌లో వచ్చిన మార్పులను, పెరిగిన చలిని తట్టుకునేందుకు.. జనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.