telangana covid cases today: తెలుగు రాష్ట్రాల్లో నిమిషానికి ఐదు కరోనా కేసులు..

telangana covid cases today: తెలుగు రాష్ట్రాల్లో నిమిషానికి ఐదు కరోనా కేసులు..

Corona Second Wave

Corona Second Wave: తెలుగురాష్ట్రాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ఏపీలో ఆరువేలు, తెలంగాణలో ఐదు వేలకు పైగా కేసులు నమోదవగా.. పరిస్థితి ఇలానే కొనసాగితే, రెండు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో నిమిషానికి దాదాపు ఐదు కేసులు నమోదవుతున్నాయి.

ఒక్క పశ్చిమ గోదావరి మినహాయించి అన్నీ జిల్లాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మరోసారి వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 6వేల 582 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 11వందల 71 కొత్త కేసులు నమోదయ్యాయ్‌. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు గుర్తించింది వైద్యశాఖ.

మరోవైపు తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ కొనసాగుతున్నాయి. పాజిటవ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కోవిడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తొలిసారిగా 5వేల 93 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 37వేల 37 యాక్టివ్ కేసులున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డిలో 407 కేసులు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అత్యధికంగా 488 కేసులు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌లో 135 కేసులు, కరీంనగర్‌లో 149 కేసులు నమోదయ్యాయి కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఒక్క GHMC పరిధిలో ఒక్కరోజే 743 కేసులు నమోదయ్యాయి.