Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.

Venkateswara Swamy Temple
Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
టీటీడీ వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య ఆలయ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్రసింగ్, జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇతర టీటీడీబోర్డు సభ్యులు పాల్గోన్నారు.