Budget 2023: ఏపీలో యూనివర్సిటీలకు నిధులు.. తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే

తాజా బడ్జెట్ ప్రకారం.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపు ఇలా ఉంది. రాష్ట్రంలోని కీలక పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు కేటాయించింది కేంద్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు.

Budget 2023: ఏపీలో యూనివర్సిటీలకు నిధులు.. తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే

Budget 2023: పార్లమెంట్‌లో బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి పలు విభాగాల కింద నిధులు అందనున్నాయి. 2023-24కు సంబంధించిన బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

తాజా బడ్జెట్ ప్రకారం.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపు ఇలా ఉంది. రాష్ట్రంలోని కీలక పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు కేటాయించింది కేంద్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు. ఇందులో ఏపీ గిరిజన యూనివర్సిటీకి వాటా ఉంటుంది. అలాగే ఏపీలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు కేటాయించారు. ఇక ఏపీలోని మంగళగిరితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజియంలకు రూ.357 కోట్లు, భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లను కేంద్రం కేటాయించింది.

Union Budjet : ఆదాయ పన్ను కడుతున్న వారికే ఆ ఛాన్స్..

తాజా బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చినట్లుగా చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్నుల శ్లాబు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్యుడికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రిబడ్జెట్ సమావేశాల్లో ఏపీ చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని బుగ్గన అభిప్రాయపడ్డారు.