Dhavaleshwaram : గోదావరి వరద ఉధృతి..ధవళేశ్వరం బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేత

ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 18.6 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో బ్యారేజీ నుంచి 7వేల 700 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు, 22 లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Dhavaleshwaram : గోదావరి వరద ఉధృతి..ధవళేశ్వరం బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేత

Dhavaleswaram

Dhavaleshwaram : ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 18.6 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో బ్యారేజీ నుంచి 7వేల 700 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు, 22 లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేశారు.

విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి ఇవాళ 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.

Godavari Floods: భ‌యం గుప్పిట్లో భ‌ద్రాద్రి.. 71.30 అడుగుల‌కు చేరిన గోదావ‌రి నీటిమ‌ట్టం..

కోనసీమ జిల్లాల్లోని 21 మండలాల్లో వరద ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. తూర్పుగోదావరిలో 9 మండలాలు, ఏలూరులో 3 మండలాలు, కాకినాడలో మరో 2 మండలాలపై వరద ఎఫెక్ట్ చూపుతుందని అంచనా వేస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

వరద ఉధృతి దృష్ట్యా అదనపు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల్లో మొత్తం 10ఎన్డీఆర్‌ఎఫ్‌, 10ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లోని 62వేల 227 మందిని 220 పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.