Government Jobs : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.93 వేలు.. ఏపీలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

Government Jobs : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.93 వేలు.. ఏపీలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Government Jobs

Government Jobs : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అసిస్టెంట్ కమిషనర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 25 అని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ గెజిటెడ్ ఉద్యోగాలకు అర్హులు. వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు.

Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వయసు 21 నుంచి 28 ఏళ్లు…. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు 28 నుంచి 42 ఏళ్లు… ఇతర పోస్టులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా డిసెంబర్ 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టు.. ఖాళీలు
ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 11
సెరీకల్చర్ ఆఫీసర్ 01
అగ్రికల్చర్ ఆఫీసర్ 06
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 02
టెక్నికల్ అసిస్టెంట్ 01
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ 03
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ 01

Bike Start Problem : హలో భయ్యా.. మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్ ట్రై చేయండి!

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 250, ఎగ్జామ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, వైట్ రేషన్ కార్డుదారులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.

ఎలా అప్లయ్ చేయాలంటే..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.