Ap Politics : కృష్ణా జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్‌..నేతలకు చంద్రబాబు క్లాస్

ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా.. కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Ap Politics : కృష్ణా జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్‌..నేతలకు చంద్రబాబు క్లాస్

Group Politics In Krishna District Tdp..

Ap Politics ..Group differences in Krishna district TDP : ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా.. కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఒకరి పరిధిలోకి.. మరొకరిని రానివ్వకుండా గిరిగీసుకు కూర్చొని మరీ.. సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం వాళ్లలో వాళ్లే పోట్లాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా నేతల మధ్య.. ఇంతలా విభేదాలకు కారణమేంటి?

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఉంది. దానికి కొందరు లీడర్లు కూడా ఉన్నారు. కానీ.. వారి మధ్య సమన్వయమే లేదని.. కేడర్‌లో టాక్ నడుస్తోంది. ఏపీలో జిల్లాలో విభజనకు ముందే.. పార్లమెంట్ స్థానాల వారీగా కమిటీలు వేసింది టీడీపీ రాష్ట్ర నాయకత్వం. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలోనూ కృష్ణా జిల్లా నుంచి 8 మందికి అవకాశం ఇచ్చారు. ఇంతమందికి పార్టీ పదవులిచ్చినా.. అంతా కలిసి పనిచేయడం లేదని.. తెలుగుదేశం శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

Also read : Telangana : బండి పాదయాత్రలో బిగ్ ట్విస్ట్..పాలమూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిస్తున్న టీఆర్ఎస్

పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా బోండా ఉమా, కొల్లు రవీంద్ర ఉన్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వర్ల రామయ్య, ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జ్‌గా బుద్ధా వెంకన్న, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవినేని ఉమా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఎంపీ కేశినేని నాని, గద్దె రాంమోహన్, కొనకళ్ల నారాయణ లాంటి సీనియర్ నేతలందరికీ పార్టీ పదవులున్నాయ్. వీరంతా.. సమన్వయంతో కలిసి పనిచేయలని పరిస్థితులున్నాయ్. విజయవాడ సిటీలో ఎమ్మెల్యే గద్దె రాంమోహన్.. కొంతవరకు యాక్టివ్‌గా ఉన్నారు. దేవినేని ఉమా.. ఎవరు కలిసొచ్చినా.. రాకపోయినా.. పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇక.. ఎంపీ కేశినేని.. దారే వేరు. గ్రూప్ పాలిటిక్స్‌కు కేంద్రమైన.. విజయవాడ వెస్ట్‌ను ఎంపీ కేశినేనికి అప్పగించారు చంద్రబాబు. దీంతో.. ఆ సెంటర్‌పై ఆశలు పెట్టుకున్న బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పశ్చిమ నియోజకవర్గం.. రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో సీనియర్ నేత.. వర్ల రామయ్య పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితమయ్యారు. బోండా ఉమా కూడా సెంట్రల్ నియోజకవర్గాన్ని దాటి రాని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో.. అధికార పార్టీ నేతల అవినీతి ఎత్తి చూపలేకపోతున్నారని.. తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలైపోతున్నారు.

Also read : COVID-19 Vaccine: 12ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో Covovax

తిరువూరు ఇంచార్జ్‌గా ఉన్న దేవదత్ పనితీరుపై.. కేడర్ అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. నందిగామ, మైలవరంలోనూ కేశినేని, దేవినేని వర్గాలు.. విడివిడిగా పనిచేస్తున్నాయ్. గన్నవరం ఇంచార్జ్ అర్జునుడు.. అష్టకష్టాలు పడుతున్నారు. అవనిగడ్డలో బుద్ధ ప్రసాద్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు, పెడనలో కాగిత కృష్ణప్రసాద్.. హడావుడియే లేదని కేడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. పామర్రులో వర్ల కుమార్ రాజా ఇంచార్జ్‌గా వచ్చాక.. పరిస్థితి కొంత మెరుగు పడిందనే టాక్ వినిపిస్తోంది.

బందరు పార్లమెంట్‌తో పోలిస్తే.. విజయవాడ పార్లమెంటులో గ్రూపు పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయ్. ప్రతి సెగ్మెంట్‌లో ఎంపీ కేశినేని, నియోజకవర్గ ఇంచార్జిల వర్గాలున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో.. కలిసి పనిచేయాల్సి పసుపు నేతలంతా.. ఎడమొహం-పెడమొహంగా ఉండటంపై.. కేడర్‌లో ఆందోళన మొదలైంది. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాల వల్లే.. అధికార వైసీపీపై రాజకీయంగా పోరాటం చేయలేకపోతున్నామని.. తెలుగుదేశం అగ్ర నాయకత్వం కూడా భావిస్తోందని.. తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న చంద్రబాబు.. త్వరలోనే వీళ్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. అందరినీ సెట్ చేయాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది.