TDP Mahanadu 2023: మహానాడు ప్రాంగణంలో గాలి వాన బీభత్సం.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన చంద్రబాబు కాన్వాయ్
సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది.

TDP Mahanadu 2023
TDP Mahanadu 2023 -Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) కడియం మండలం వేమగిరి వద్ద నిర్వహిస్తోన్న టీడీపీ (TDP) మహానాడు రెండో రోజులో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మహానాడు జరుగుతోన్న ప్రాంతంలో గాలి వాన బీభత్సం సృష్టించింది.
బలమైన ఈదురు గాలులకు ఫ్లెక్సీలు కూలిపోయాయి. సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది. వేదిక పై ఉన్న ఎల్‌ఈడీలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది.
మహానాడు బహిరంగ సభలో టీడీపీ కార్యకర్తలు తడిసిపోయారు. భారీ వర్షంలోనూ టీడీపీ నేతలు ప్రసంగిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టీడీపీ తొలి మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను ఇవాళ ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని అన్నారు.
టీడీపీ మేనిఫెస్టో రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ఉండనుంది. ఈ ఏడాది దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ మహానాడు వేదికగా యువతకు శుభవార్త చెబుతామని టీడీపీ నేత నారా లోకేశ్ కూడా చెప్పారు.
Lok Sabha Elections 2024: విపక్షాల కీలక నిర్ణయం.. బీజేపీని ఓడించేందుకు వ్యూహం.. భేటీకి ముహూర్తం