Heavy Rains : ఏపీకి వర్ష సూచన..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2021, నవంబర్ 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rains : ఏపీకి వర్ష సూచన..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains In Ap

Updated On : November 11, 2021 / 11:52 AM IST

Heavy To Heavy Rains AP : ఏపీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2021, నవంబర్ 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగళాఖాతం..దాని సమీప ప్రాంతాల్లో…సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని, ఇది…48 గంటల్లో బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్యంగా..ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశం ఉందని…దీని ప్రభావం కారణంగా…రాయలసీమ, దక్షిణ కోస్తాలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

Read More : Bank Jobs : దరఖాస్తుకు 2 రోజులే గడువు…4,135 బ్యాంక్ ఉద్యోగాలు..

11, 12 తేదీల్లో చిత్తరు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని..అలాగే…విజయనగరం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు. ఆదివారం భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతాలకుతలమైన సంగతి తెలిసిందే. నెల్లూరుతో పాటు చిత్తూరులో కూడా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు జలమమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో నిత్యావస సరుకులు, ఇతర వస్తువులు నీట మునిగిపోయాయి.

Read More : Yapral Ganja : అబ్బా..ఏం తెలివి…ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి సాగు

మరోవైపు… బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వల్ల ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర సముద్రతీర జిల్లాల్లో ఆ రెండు రోజులపాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చెన్నైకి నీరందించే జలాశయాలైన పూండి, సెంబరంబాక్కం నుంచి ముంపు ముప్పు ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.