High Court : కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు

కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తుది తీర్పుకు లోబడే లోకాయుక్త, హెచ్ఆర్ సీ కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని తెలిపింది.

High Court : కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు

Ap High Court

HRC and Lokayukta in Kurnool : కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తుది తీర్పుకు లోబడే లోకాయుక్త, హెచ్ఆర్ సీ కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు శనివారమే కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు అయింది.

ఏపీ న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామన్న కర్నూలులో లోకాయుక్తతోపాటు మానవ హక్కుల కమిషన్ కు సంబంధించిన కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకే లోకాయుక్తకు సంబంధించిన కార్యాలయం ఏర్పాటు అయింది. హైదరాబాద్ నుంచి హెచ్ఆర్ సీకి సంబంధించిన కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో లోకాయుక్త, హెచ్ఆర్ సీ కార్యాలయాలను రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని వేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కర్నూలులో హెచ్ఆర్ సీ, లోకాయుక్త కార్యాలయాల ఏర్పాటు.. తుది తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఆర్ సీ కర్నూలులో ఏర్పాటు చేయకుండా ఆపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రసాద్ బాబు హైకోర్టును కోరారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హెచ్ఆర్ సీ హైదరాబాద్ లోనే ఏదో ఒక చోట ఉండాలని ఇచ్చిన ఆదేశాలను ప్రసాద్ బాబు చదివి వినిపించారు. ఇంతకముందు హెచ్ఆర్ సీ ఏపీకి తరలించాలని ఇతరులు వేసిన పిటిషన్ లో అమరావతిలోనే ఏర్పాటు చేయాలని కోరలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.

దానికి దీనికి సంబంధం లేదని, హెచ్ఆర్ సీతోపాటు లోకాయుక్త రాజధానిలోనే ఉండాలని ప్రసాద్ బాబు తెలిపారు. గతంలోనూ అదేవిధంగా కొనసాగేది ఇప్పుడు కొత్తగా మరో చోటుకు తరలిస్తే కనుక ప్రజులు ఇబ్బంది పడే అవకాశాలుంటాయని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే వీటన్నింటినీ విచారించి.. లోకాయుక్త, హెచ్ఆర్ సీ ఎక్కడ ఉండాలనేదాన్ని నిర్ణయిస్తామని హైకోర్టు చెప్పింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.