High Court: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు.. రెండ్రోజుల్లో వృద్ధులందరికీ వ్యాక్సిన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

High Court: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు.. రెండ్రోజుల్లో వృద్ధులందరికీ వ్యాక్సిన్!

Ap High Court

Vaccine for old people: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెమిడెసివర్ ఇంజిక్షన్లు కాలం చెల్లినవి అంటూ వచ్చిన వార్తల నేపధ్యంలో.. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగ కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ డీసీఐ ఇచ్చిన ఆదేశాలను కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు ప్రభుత్వ న్యాయవాది.

కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్యచికిత్సలు అందిస్తున్నారు? అని న్యాయస్థానం ఆరా తీసింది. మెంటల్ హెల్త్ యాక్ట్‌ను ఏ విధంగా అమలు చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇదే సమయంలో వృద్ధులకు వాక్సినేషన్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మెమో దాఖలు చేసిన ప్రభుత్వం.. రెండ్రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని స్పష్టంచేసింది. దీంతో వృద్ధుల వ్యాక్సినేషన్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయ్యింది.