Macherla High Tension : మాచర్లలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.

Macherla High Tension : మాచర్లలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

Updated On : December 16, 2022 / 9:51 PM IST

Macherla High Tension : పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి.

Also Read..Andhra Pradesh: పల్నాడు జిల్లాలో టీడీపీ ఇన్‌ఛార్జిపై దాడికి వైసీపీ యత్నం.. తిప్పికొట్టిన టీడీపీ శ్రేణులు

వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Also Read.. CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

టీడీపీ, వైసీపీ పరస్పర దాడులతో మాచర్ల పట్టణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల చంద్రవంక బ్రిడ్జిపై టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బ్రహ్మానంద రెడ్డిని మాచర్ల నుంచి పంపించేశారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.