TTD : తిరుమల కిటకిట.. వీకెండ్ రష్

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...

TTD : తిరుమల కిటకిట.. వీకెండ్ రష్

Ttd (1)

Huge Devotees Rush At Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కిటకిటలాడుతోంది. గోవింద నామస్మరణంతో మారుమ్రోగుతోంది. కరోనా కారణంగా టీటీడీ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులోకి వస్తుండడంతో టీటీడీ నిబంధనలు ఎత్తివేసింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ లో ఈ రష్ ఎక్కువగా ఉంటోంది. దీంతో అలపిరి వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. తాజాగా.. 2022, మార్చి 13వ తేదీ ఆదివారం తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది.

Read More : Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో స్వామి వారి దర్శనానికి సాధారణ స్థాయిలోనే భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. దీంతో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగిపోయింది. శనివారం స్వామివారికి దర్శించుకున్న భక్తుల సంఖ్య 75 వేలు దాటింది. కరోనా ఆంక్షలు మొదలైన తర్వాత స్వామి వారిని ఈ స్థాయిలో భక్తులు దర్శించుకోవడం ఇదే తొలిసారి. ఆదివారం కూడా 80 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు.

Read More : Tirumala : తిరుమలలో హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయి-టీటీడీ చైర్మన్

మరోవైపు…తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 13 నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరిస్తారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగనున్నారు. చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 13, 14న జరగాల్సిన వర్చువల్ అర్జిత సేవ లైన సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మార్చి 17తో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ వెల్లడించింది.