Exams Postpone: తుఫాను ప్రభావం: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.

Exams Postpone: తుఫాను ప్రభావం: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

Asani

Exams Postpone: బంగాళఖాతం నుంచి పొంచిఉన్న తీవ్ర తుఫాను అసని కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో బుధవారం జరగనున్న పలు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు. రేపటి ఈ మూడు పరీక్ష మినహా మిగతా పరీక్షలు..బోర్డు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read Others:Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అసని దిశ మార్చుకుంది. ముందుగా ఉత్తర కోస్తా – ఒడిశా మధ్యలో బుధవారం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు ప్రకటించినా కృష్ణాజిల్లా మచిలీపట్నం వైపు తుఫాను దూసుకొస్తుంది. బుధవారం సాయంత్రం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తుఫాను నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, తూర్పు,పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తం అయింది. ఎక్కడిక్కడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించి..సహాయక చర్యలు చేపట్టింది. తుఫానుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Also read:Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష