Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుద‌ల‌ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 4,23,455 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 258,449 (61శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

Intermediate Results

Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుద‌ల‌ చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ లో 9,41,358 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 4,23,455 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 258,449 (61శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?

ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం మంది పాస్ కాగా, సెకండ్ ఇయర్ పలితాల్లో బాలురు 54శాతం, బాలికలు 68శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 72 శాతం తో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 47శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 69శాతంతో కృష్ణా జిల్లా తొలిస్థానంలో నిలవగా, 41శాతం తో కడప జిల్లా ఆఖరు స్ధానంలో నిలిచింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.