Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా సాగుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం.

Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?

Maharastra

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారుతోంది. గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేకంటే అసెంబ్లీ రద్దు చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.  మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Maharashtra: మా ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజ‌య్ రౌత్

శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేతో దాదాపు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు మరో ఇద్ధరు శివనసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. దీంతో షిండే వర్గీయులు సంఖ్య 46కు చేరింది. బుధవారం ఉదయం గౌహతి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం తన మద్దతు దారులతో మహారాష్ట్ర గవర్నర్ తో భేటీ కవాలని ఏక్ నాథ్ షిండే భావించారు. గవర్నర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం గవర్నర్ చేశారు. షిండే భేటీ నేపథ్యానికి కంటే కాస్త ముందే ఆయన ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

ఏక్ నాథ్ షిండే తో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఉదయంసైతం చర్చలు జరిపినట్లు తెలిసింది. షిండే మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీలతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడే తాము మహారాష్ట్రలో అడుగు పెడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. షిండే డిమాండ్ కు ఉద్ధవ్ ఠాక్రే ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. జేపీతో రాజీపడే కంటే అసెంబ్లీనిరద్ధు చేసుకోవటమే మేలన్న భావనకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చుతూ.. ఆధిత్య థాకరే తన ట్విట్టర్ ఖాతా ఫ్రొఫైల్ లో రాష్ట్ర మంత్రి హోదాను తొలగించుకున్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని పరోక్షంగా శివసేన నేతలు అంగీకరిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు.