TV Rama Rao: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా జనసేనకు మాత్రమే ఉంది.. ద్వారంపూడి బతుకేంటో నాకు తెలుసు
కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి స్థాయికి నేనే ఎక్కువ. ద్వారంపూడి బతుకేంటో నాకు తెలుసు. ఈరోజు ద్వారంపూడి పోర్టులో ఉన్నారంటే దానికి కారణం నేనే అని మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు అన్నారు.

Former MLA TV Rama Rao
Janasena Party: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత టీవీ రామారావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి హద్దులు మీరి మాట్లాడుతున్నాడని విమర్శించారు. దమ్ముంటే నాపై పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ద్వారంపూడి అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుక్కలపై పోటీ చేయరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్
కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి స్థాయికి నేనే ఎక్కువ. ద్వారంపూడి బతుకేంటో నాకు తెలుసు. ఈరోజు ద్వారంపూడి పోర్టులో ఉన్నారంటే దానికి కారణం నేనే. కాకినాడ నేను వెళితే ద్వారంపూడి బతుకంతా బయట పడుతుంది అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క జనసేనకు మాత్రమే ఉంది. అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామారావు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టి వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్ర కాకినాడలో సాగిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ అవినీతి ఆరోపణలు చేశారు. ద్వారంపూడి సైతం పవన్ కళ్యాణ్ కు ధీటుగా కౌంటర్ విమర్శలు చేశారు. దీంతో ద్వారంపూడి వర్సెస్ జనసేన నేతలు అన్నట్లు పొలిటికల్ వార్ జరుగుతుంది. తాజాగా ద్వారంపూడిపై మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు విమర్శలు గుప్పించారు.