Jennifer Larson: టీటీడీలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ స్పందన

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని జెన్నిఫర్‌ లార్సన్‌ చెప్పారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమె పుర్యటించారు.

Jennifer Larson: టీటీడీలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ స్పందన

Jennifer Larson

Updated On : August 4, 2023 / 7:03 PM IST

Jennifer Larson – Hyderabad: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నిఫర్‌ లార్సన్‌ ఇవాళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇవాళ ఉదయం ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (TTD) సందర్శించుకున్నారు.

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని ఆమె చెప్పారు. ఇక్కడి నిర్వహణ, భారీగా వచ్చే భక్తులకు సదుపాయాలు అందిస్తున్న తీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అనంతరం తిరుపతిలో ఆమె మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీని ప్రారంభించారు. మహిళలు ఇందులో పాల్గొంటున్న తీరుపై ఆమె ప్రశంసలు గుప్పించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో ప్రారంభించారు. అలాగే, అమరరాజా గ్రూప్, శ్రీసిటీకి సంబంధించిన కేంద్రాలను ఆమె సందర్శించి అక్కడ పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

Sanjay Kapoor : తన ఫస్ట్ ఫోటోషూట్ ‘అమల’తోనే అంటూ బాలీవుడ్ హీరో పోస్ట్.. భార్య ఫన్నీ కామెంట్..