Junior Doctors : ఏపీలో సమ్మె బాట పట్టిన జూడాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విజయవాడలో ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు.

Junior Doctors : ఏపీలో సమ్మె బాట పట్టిన జూడాలు

Junior Doctors Strike

Junior Doctors :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు. ప్రజలకు సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం సబబేనా… కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశాం అంటూ ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.

మా ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం…. ఇటీవల వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి… చట్టాలు ఉన్నా… వాటిని అధికారులు అమలు చేయడం లేదని వారు తెలిపారు. మొక్కుబడి చర్యల వల్ల మాకు రక్షణ లేకుండా పోయింది… కఠిన శిక్షలు ఉంటేనే…దాడులను అరికట్టవచ్చని జూడాలు పేర్కోన్నారు.
Also Read : Family Dispute : విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త
మాకు భద్రత ఉంటుందనే భరోసా ప్రభుత్వమే కల్పించాలి వారు కోరారు. జూడాలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈరోజు నుంచి ఓపి సేవలను నిలిపివేశాం..ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు సంఘం నాయకులు చెప్పారు.

మరో వైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోనూ  జూనియర్‌ డాక్టర్లు మూడో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విధులు బహిష్కరించి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్లపై ఓ రోగి బంధువు దాడి చేయడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా వారు నిరసన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేంతవరకు తాము విధులకు హాజరుకాబోమని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.