AP Governor Justice Abdul Nazir : ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.

AP Governor Justice Abdul Nazir : ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

GOVERNOR

AP Governor Justice Abdul Nazir : ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు మూడో గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి ఈ ఏడాది జనవరి 4న పదవి విరమణ పొందారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెళువాయిలో జన్మించిన నజీర్.. ముడిబిద్రిలోని మహావీర్ కళాశాలలో బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంగళూరులోని ఎస్టీఎం కాలేజీ నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు.

Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్

కర్ణాటక హైకోర్టులో సేవలందిస్తుండగానే పదవోన్నత పొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేయకుండానే దేశ సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మూడో జడ్జీగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 17 నుంచి 2023 జనవరి 4వరకు సేవలందించారు.