KA Paul Dharna : కేఏ పాల్ దూకుడు.. రేపు జంతర్ మంతర్‌లో ధర్నా.. కేసీఆర్, జగన్‌కు ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.

KA Paul Dharna : కేఏ పాల్ దూకుడు.. రేపు జంతర్ మంతర్‌లో ధర్నా.. కేసీఆర్, జగన్‌కు ఆహ్వానం

Ka Paul Dharna

KA Paul Dharna : తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న పాల్.. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. రేపు జంతర్ మంతర్ లో ఆయన ధర్నాకు కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నట్లు కేఏ పాల్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని పాల్ డిమాండ్ చేశారు. తన ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని పాల్ కోరారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు తన ధర్నాకు రావాలని కేఏ పాల్ పిలుపు నిచ్చారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేఏ పాల్ ప్రకటించారు.

KA Paul : ఆగస్టు 15 లోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా

తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేద్దామని పాల్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల సత్తా కేంద్రానికి చూపిద్దామన్నారు.

తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని పాల్ కేంద్రాన్ని కోరారు. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.

KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్

ఇప్పటికే ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మౌన దీక్ష చేసిన పాల్.. విభజన హామీల అమలు కోసం బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ఇదివరకే ప్రకటించారు. అంతేకాదు.. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్న ఆయన.. అందుకే తాను పోరాటానికి దిగుతున్నట్టు వెల్లడించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఓవైపు తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తూనే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్ కు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు పాల్. ఏపీ, తెలంగాణలో రోడ్‌ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ‘పాల్‌ రావాలి-పాలన మారాలి’ నినాదంతో తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని గతంలోనే పాల్ ప్రకటించారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించడానికి కేఏ పాల్ ఏర్పాట్లు చేసుకున్నారు.