Ap cabinet : దుర్గమ్మను దర్శించుకున్నకారిమూరి, ముత్యాల నాయుడు.. మరికొద్దిసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం

ఏపీ నూతన కేబినెట్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 25 మంది మంత్రులచేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు ....

Ap cabinet : దుర్గమ్మను దర్శించుకున్నకారిమూరి, ముత్యాల నాయుడు.. మరికొద్దిసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం

Kamuri, Nayudu

Ap cabinet : ఏపీ నూతన కేబినెట్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 25 మంది మంత్రులచేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ప్రత్యేక వేదిక వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. మంత్రి పదవులు దక్కిన వారు తమ ఇష్టదైవాలను దర్శించుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న కారిమూరి నాగేశ్వరరావు, ముత్యాల నాయుడులు సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు.

Ys jagan : మారిన జగన్ వ్యూహం.. కొత్త కేబినెట్‌లో 10మంది పాత మంత్రులకు ఛాన్స్?

జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసన సభ్యులు కారిమూరి నాగేశ్వరరావు మంత్రిగా మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 10టీవీతో కారిమూరి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహణ్ రెడ్డి నమ్మకాన్ని వమ్ముచేయనని తెలిపాడు. నాకు ఏ శాఖ అప్పగించినా ఆశాఖకు పూర్తి న్యాయం చేస్తానని కారిమూరి నాగేశ్వరరావు తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావటమే ధ్యేయంగా తనవంతు కృషిచేస్తానని తెలిపారు.

Jagan Cabinet 2.0 : కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం.. మహిళకే హోంమంత్రి పదవి ?

జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్న అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి ముందు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు 10టీవీతో మాట్లాడుతూ.. నాకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తమ అధినేత నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేయనని, నాకు ఏ శాఖ అప్పచెప్పినా ఆ శాఖకు పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. ప్రతిఒక్కరికి నా శాఖ తరుపున సంక్షేమ పథకాలు అందచేయడమే నా ‌లక్ష్యంమని, ఈ క్రమంలో 2024 లో వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తనశక్తిమేర కృషిచేస్తానని తెలిపారు.