చిత్తూరు జిల్లాలో అమానుషం : దళిత మహిళ మృతదేహాన్ని తమ వీధిగుండా తీసుకెళ్లకుండా అడ్డుకున్న భూస్వాములు

చిత్తూరు జిల్లాలో అమానుషం : దళిత మహిళ మృతదేహాన్ని తమ వీధిగుండా తీసుకెళ్లకుండా అడ్డుకున్న భూస్వాములు

landlords prevented the dead body of a Dalit woman : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నాం. అత్యాధునిక యుగంలో ఉన్నాం. కానీ దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనేవుంది. అంటరానితనం పాటిస్తున్నారు. సాటి మనిషిని మనిషిలాగా చూడటం లేదు. దళితులపట్ల చిన్నచూపు చూస్తున్నారు. అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. అగ్రకులాల ఇంట్లోకి రానివ్వడం లేదు. కనీసం వీధుల్లోనూ తిరగనివ్వడం లేదు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు.

చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కొత్తపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. దళిత మహిళ మృతదేహాన్ని తమ వీధిగుండా తీసుకెళ్లడాన్ని గ్రామానికి చెందిన పలువురు భూస్వాములు అడ్డుకున్నారు. దీంతో మహిళ శవాన్ని రోడ్డుపైనే ఉంచి గ్రామ పెద్దల నిర్ణయం కోసం దళితులు కాసేపు పడిగాపులు కాశారు. పెద్దలు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో దళితులు వారితో వాగ్వాదానికి దిగారు. మహిళ శవాన్ని ఎలా తీసుకెళ్లాని ప్రశ్నిస్తున్నారు.