Kottu Satyanarayana : తమ్ముడూ పవన్ కల్యాణ్ జాగ్రత్త.. నిన్ను హత్య చేస్తే ఎవరికి లాభమో తెలుసుకో- మంత్రి కొట్టు సత్యనారాయణ
Kottu Satyanarayana : పవన్ గురించి ఆలోచించే టైమ్ జగన్ కు ఉందా? పవన్ ను హత్య చేయడం వల్ల ఎవరికి లాభం? వంగవీటి మోహన రంగాను చంపడంలో..

Kottu Satyanarayana
Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార వైసీపీ నాయకులు.. టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వారాహి యాత్రలో అధికార పార్టీ నేతలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ మంటలు పుట్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తీవ్రమైన మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు.
తాజాగా ఏపీ మంత్రి కొట్టు నారాయణ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ కు ఎవరి నుంచైనా ప్రాణహాని ఉందంటే.. అది కేవలం చంద్రబాబు నుంచే అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. అసలు.. పవన్ ను హత్య చేస్తే ఎవరికి లాభం? అని ఆయన ప్రశ్నించారు. ”పవన్ కల్యాణ్.. నువ్వు అన్నట్లు నీకు నిజంగానే ప్రాణహాని ఉన్నట్లు నీకు వేగుల ద్వారా సమాచారం ఉంటే.. నీ ఆరోపణలు నిజమే అయితే, చంద్రబాబు నుంచే నీకా ప్రమాదం ఉంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.(Kottu Satyanarayana)
” సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొందరు రాజకీయంగా తమ పని అయిపోయిందని భయంతోనే జగన్ రహిత పాలన కావాలని నినాదంతో వెళ్తున్నారు. నిజానికి చంద్రబాబు రహిత పాలన రావాలి. అది జగన్ వల్లే సాధ్యం అవుతుంది. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు వాడుకున్నారు. లక్షల కోట్లు సంపాదించారు.
ప్రజల మనసులను విషతుల్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సీఎం జగన్ పై నిందలు వేయాలని చూస్తున్నారు. వారాహి యాత్రలో మావాడు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలతో చులకన అవుతుంటే సాటి కులస్తుడిగా బాధపడుతున్నా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను మా కులస్తులు అందరూ గౌరవిస్తారు. కులాభిమానంతో ఏదైనా చేసి పెట్టండి అని రావడం సహజం.(Kottu Satyanarayana)
చంద్రబాబు చేసే మారణహోమానికి పవన్ కల్యాణ్ పావు అవుతున్నారు. వంగవీటి మోహన రంగాను చంపడంలో, ఎన్టీఆర్ చావులో ప్రధాన పాత్ర చంద్రబాబుది కాదా? పవన్ చేష్టలపై ముద్రగడ పద్మనాభం కూడా లేఖ రాశారు. పవన్ తింగరి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏం చెబితే అదే అంటున్నారు.
తన హత్యకు కుట్ర పన్నుతున్నారని పవన్ అంటున్నారు. అసలు, పవన్ గురించి ఆలోచించే టైమ్ జగన్ కు ఉందా? పవన్ కల్యాణ్ ను హత్య చేయడం వల్ల ఎవరికి లాభం? రంగా హత్య అనంతరం కాంగ్రెస్ విజయం సాధించింది. నీకు ప్రాణహాని ఉన్నట్లు నీకు వేగుల ద్వారా సమాచారం ఉంటే.. ఆ ప్రమాదం నీకు చంద్రబాబు నుంచే ఉంది. కుట్రలు చేసే తత్వం చంద్రబాబుది.
Also Read..Pawan Kalyan : ముస్లింలతో సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తమ్ముడూ పవన్ కల్యాణ్.. నాకు గానీ, మా పార్టీకి గానీ నీపై వ్యక్తిగత ద్వేషం లేదు. దుర్మార్గుడైన చంద్రబాబు ఆలోచనలను డౌన్ లోడ్ చేసుకున్న నువ్వు ఆ కోవలోనే చేరతావు. వారాహి యాత్రలో ఏ సభలోనూ రెండు, మూడు వేల మంది జనం ఉన్న సభ ఉందా? ఉన్న వారే అన్ని మీటింగ్ లలో ఉన్నట్లు ఫోటోలలో కనబడుతోంది.
ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని.. పాచిపోయిన లడ్డూలు పంపించారని వెంకయ్య నాయుడిని తిట్టారు. చంద్రబాబు ప్రతి మేనిఫెస్టోలో దాదాపు 650 హామీలు ఇస్తారు. మొత్తం కలిపితే దాదాపు 2వేల హామీలు ఉంటాయి. చంద్రబాబు మేనిఫెస్టో కొత్త వాల్యూమ్ అబద్దాల పుట్ట. జగన్ మేనిఫెస్టో రెండు పేజీలు మాత్రమే ఉంటుంది. అదే బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని జగన్ చెబుతారు. అది మా అందరి టేబుల్ పై ఉంటుంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.(Kottu Satyanarayana)