ఆత్మహత్య చేసుకున్నాడా? : ప్రభుత్వ మద్యం షాపు నుంచి రూ.9లక్షలతో వెళ్లిన సూపర్ వైజర్ ఏమయ్యాడు..?

అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 06:40 AM IST
ఆత్మహత్య చేసుకున్నాడా? : ప్రభుత్వ మద్యం షాపు నుంచి రూ.9లక్షలతో వెళ్లిన సూపర్ వైజర్ ఏమయ్యాడు..?

అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్

అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్ చేసుకున్నాడా? మర్డర్ చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు. రూ.9లక్షలతో మద్యం షాపు నుంచి వెళ్లిన శ్రీనాథ్.. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది సస్పెన్స్ గా మారింది.  వివరాల్లోకి వెళితే.. సూపర్ వైజర్ గా పని చేస్తున్న శ్రీనాథ్.. మద్యం షాపులో (సీఆర్‌ఓ నంబర్‌11146) రోజూ వసూలైన కలెక్షన్‌ను బ్యాంకులో చెల్లించేవాడు. రశీదులను ఎక్సైజ్‌ అదికారులకు అప్పగించేవాడు.

కాగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన రూ.9లక్షల డబ్బును తన దగ్గరే ఉంచుకున్నాడు శ్రీనాథ్. సోమవారం(డిసెంబర్ 23,2019) షాపు తనిఖీ చేసిన ఎక్సైజ్‌ పోలీసులు.. రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్లాడు శ్రీనాథ్‌. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎక్సైజ్‌ అధికారులకు మద్యం షాపు సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీనిపై కుటుంబసభ్యులతో విచారించిన తర్వాత ఎక్సైజ్‌ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

శ్రీనాథ్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో ఉన్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్‌ సైతం మాల ధరించి  ఉండటంతో.. చనిపోయింది శ్రీనాథ్‌ అని పోలీసులు సందేహిస్తున్నారు. శవం కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్‌ అని నిర్ధారించినా డీఎన్‌ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చాకే క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.

కాగా, శ్రీనాథ్‌కు ఆన్‌లైన్‌ బెట్టింగే ఆడే అలవాటు ఉందని సన్నిహితుల ద్వారా పోలీసులకు తెలిసింది. తన దగ్గరున్న మద్యం షాపు డబ్బును ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక శ్రీనాథ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సన్నిహితులు అనుమానిస్తున్నారు. శ్రీనాథ్ బెట్టింగ్‌ లావాదేవీలు తన సెల్‌ఫోన్‌లోనే జరిపేవాడని తేలింది. ఈ క్రమంలో అతడి సెల్‌ఫోన్‌ సైతం మాయం కావడం మిస్ట మారింది. అయితే సెల్‌పోన్‌లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్‌లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడే ఛాన్స్ ఉంది. 

మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ అదృశ్యంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు  చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 4 రోజుల క్రితం కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో ఉన్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్‌ సైతం మాలధరించి ఉండటంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నామన్నారు. అలాగే కాల్ డేటాను కూడా విశ్లేషించే పనిలో ఉన్నామన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. జగన్ ప్రభుత్వమే ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిగ్రీ చదివిన వ్యక్తులను మద్యం షాపులో సూపర్‌వైజర్‌లుగా పెట్టింది ప్రభుత్వం. అలాగే సేల్స్‌ మ్యాన్, సెక్యూరిటీని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది. ఏ రోజుకారోజు.. మద్యం అమ్మగా వచ్చిన డబ్బుని బ్యాంకులో కట్టి రశీదు తీసుకోవాల్సిన బాధ్యత సూపర్ వైజర్లదే. ఆ రసీదులను ఎక్సైజ్ అధికారులకు అప్పగించాలి.